![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం భరణి ఎలిమినేషన్ అవ్వగా ఏడో వారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ సారి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ని కూడా నామినేషన్లో ఉంచేలా బిగ్ బాస్ పకడ్బందీగా ప్లాన్ చేశాడు. ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ నామినేషన్ లోకి వచ్చేశారు. ఆ ఇద్దరు ఎవరో.. ఆ వివరాలేంటో ఓసారి చూసేద్దాం.
బిగ్ బాస్ మొదటగా ఇమ్మాన్యుయల్, అయేషాలకు ఒక టాస్క్ ఇచ్చారు. హౌస్ లో వందలకొద్దీ బెలూన్స్ ఉంచారు. వాటిని పగలగొడితే కొన్ని చీటీలు బయటపడతాయి. అవి నామినేషన్స్ కి సంబంధించిన చీటీలు. వాటిని ఇమ్మాన్యుయల్, అయేషా తము కోరుకున్న వారికి ఇవ్వొచ్చు. ఆ విధంగా చీటీలు పొందిన వారు వేరే వాళ్ళని నామినేట్ చేయొచ్చు. అందులో ఒక డైరెక్ట్ నామినేషన్ ఉంటుంది. అయేషా డైరెక్ట్ నామినేషన్ చీటీని తనవద్దే ఉంచుకుంది. దీనితో అయేషా ముందుగా రీతూని డైరెక్ట్ నామినేట్ చేసింది. దీనికి అయేషా చెప్పిన రీజన్ వ్యాలిడ్ అనిపించింది. రీతూ చేసే ఓవరాక్షన్ నాకు నచ్చట్లేదు. రీతూ బిగ్ బాస్ కి వచ్చింది లవ్ ట్రాక్ నడపడానికి మాత్రమే. కెమెరాలో కనిపించడానికి అది చాలా సులభమైన మార్గం. ఎంతసేపు లవ్ ట్రాక్ లు నడుపుకుంటూ టైమ్ గడుపుతోంది. గేమ్ అసలు ఆడట్లేదంటూ అయేషా వ్యాలిడ్ రీజన్లు చెప్తూ నామినేషన్ చేయగా రీతూ కూడా చాలా స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకుంది.
కాసేపటికి రీతూ కూడా తిరిగి అయేషాని నామినేట్ చేసింది. ఈసారి వీరిద్దరు నువ్వా నేనా అన్నట్టుగా గొడవపడ్డారు. మొత్తంగా రీతూ చౌదరి డైరెక్ట్ గా నామినేట్ అయింది. ఆ తర్వాత అయేషా, సాయి శ్రీనివాస్ లని దివ్య నామినేట్ చేసింది. ఎవరి బలమేంటో.. ఎవరి బలహీనత ఏంటో మీకు తెలియదు.. ఫస్ట్ అవతలి వారి గురించి తెలుసుకొని మీరు మాట్లాడండి.. హైపర్ అవుతున్నారు.. అది తగ్గించుకోండి అని అయేషాని దివ్య అనడంతో తను యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత శ్రీనివాస్ సాయిని దివ్య నామినేట్ చేసి.. మీరు మానిప్యులేటర్.. మీ గేమ్ మీరు ఆడండి.. వాళ్ళవి వీళ్ళకి.. వీళ్ళవి వాళ్లకి చాడీలుగా చెప్పకండి అని శ్రీనివాస్ సాయిని దివ్య అనడంతో.. తనని తాను డిఫెండ్ చేసుకునే క్రమంలో ఈ హౌస్ లో ఫ్యామిలీని మెయిన్ టైన్ చేసింది నువ్వేనంటూ దివ్యని అన్నాడు. భరణి నీ వల్లే ఎలిమినేట్ అయ్యాడంటూ శ్రీనివాస్ సాయి అనగానే దివ్య షాక్ అయింది. ఇక తనని తాను డిఫెండ్ చేసుకొని శ్రీనివాస్ సాయిని నామినేట్ చేసింది. అయితే వీరిద్దరిలో దివ్య వ్యాలిడ్ రీజన్లతో నామినేట్ చేసింది.
![]() |
![]() |